నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(NIPER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 2
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ గ్రేడ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీకామ్, ఎమ్మెస్సీ, ఎం ఫార్మసీ, ఎంవీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి ఉద్యోగాన్ని బట్టి 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.500
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.niperhyd.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.