NILD కోల్ కతాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే

Update: 2022-03-03 08:57 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్(NILD)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11

*పీఎం–ఆర్, క్లినికల్‌ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ ఈ1 యూనిట్‌ పట్నా, స్పీచ్‌–హియరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్‌ అసిస్టెంట్, క్లినికల్‌ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*త్రిపుర–05, పాట్నా–04, ఐజ్వాల్‌–02, డెహ్రాడూన్‌–02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి  ఉద్యోగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో  డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీఆర్‌ఎస్‌/తత్సమాన, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్, ఎండీ/ఎంఎస్‌ పాసై  ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం నెలకు రూ.25000 నుంచి రూ.80000 వరకు వేతనం చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Director, National Institute for Locomotive Disabilities (Divyangjan), BT Road, Ban – Hooghly, Kolkata – 700090 చిరునామాకి పంపాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.niohkol.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Tags:    

Similar News