కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిప ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(NMDC)కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 17
*ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీతో పాటు పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ పాసై ఉండాలి. యూజీసీ నెట్ స్కోర్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 27 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయస్సులో సడలింపు ఉంది.
*ఉద్యోగ ఎంపిక కోసం యూజీసీ నెట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకి నెలకు రూ.50,000 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.