HLL లైఫ్ కేర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న సంస్థ HAL లైఫ్ కేర్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలోJobs in HAL Life Care Limited ..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న సంస్థ HLL లైఫ్ కేర్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 59
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 12
*ఇందులో నర్సింగ్ ట్రైనర్, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*నర్సింగ్ ట్రెయినర్ ఉద్యోగానికి సంబంధించి బీఎస్సీ(నర్సింగ్) పాసై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజస్టర్ అయి ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఏడాది ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగానికి సంబంధించి జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్) నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజస్టర్ అయి ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఏడాది ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 40 ఏళ్ల వయస్సు మించరాదు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.lifecarehll.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.