చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, నెలకు రూ.2లక్షలకు పైనే వేతనం

Update: 2022-03-05 02:24 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(CMRL)లో కాంట్రాక్ట్ విధానంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు  ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 19

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11

*అండర్‌గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్,సేఫ్టీ, డిజైన్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

*ఇందులో  జనరల్‌ మేనేజర్‌–01, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌–02, జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌–02, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–01, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–01, మేనేజర్‌–04, డిప్యూటీ మేనేజర్‌–04, అసిస్టెంట్‌ మేనేజర్‌–04 పోస్టులు వేకన్సీ  ఉన్నాయి. 

* విద్యార్హతకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ పాసై  ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 

*ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.2,25,000 వరకు వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Joint General Manager (HR), Chennai Metro Rail Limited, CMRL Depot, Admin Building, Poonamallee High Road, Coimbatore, Chennai – 600107 చిరునామాకి పంపించాలి. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://chennaimetrorail.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు. 

Tags:    

Similar News