6, 9 వ తరగతులకు.. మిలిటరీ స్కూల్స్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రక్షణ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది.
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రక్షణ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో(Rashtriya military schools) 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మిలిటరీ స్కూల్స్ లలో ప్రవేశాలు పొందటానికి ఆర్మీ స్కూల్స్ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్ 19 వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అర్హతలు(Qualifications): 6 వ తరగతిలో ప్రవేశం పొందటానికి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5 వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రస్తుతం 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి వయసు 10-12 ఏళ్ల మధ్య ఉండాలి. మరియు 9 వ తరగతిలో ప్రవేశాల కొరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8 వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వీరి వయసు 13-15 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎన్నిక విధానం(Selection Process): రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్, ఇంకా రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. పరీక్ష.. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపం(OMR)లో ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 19 కాబట్టి ఈ తేదీ లోపుగా విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
వెబ్ సైట్: పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్ సైట్ చూడగలరు.