రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మవంటిదని పేర్కొన్నదెవరు..??

ప్రాథమిక విధులను 1976 సంవత్సరంలో పొందపరిచారు.Important bits related to polity

Update: 2022-03-29 09:21 GMT

*ప్రాథమిక విధులను 1976 సంవత్సరంలో పొందపరిచారు. 

*ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 

*రాజ్యాంగంలో ప్రాథమిక విధులు 4(ఎ) భాగంలో ఉంటాయి. 

*ప్రాథమిక విధులను  చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ- స్వరణ్ సింగ్ కమిటీ

*ప్రాథమిక విధులు ఆర్టికల్ 51ఎ లో ఉంటాయి. 

*ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.

*42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను అధకమించవచ్చునని సూచించింది. 

*ప్రాథమిక విధులు న్యాయసమ్మతమైనవి కావు

*జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రాథమిక విధి

*ఎల్ఎం సంఘ్వీ కమిటీ సిఫారసు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు. 

*సంక్షేమ రాజ్య స్థాపన అనే భావన  ఆదేశిక సూత్రాల్లో రూపొందించారు. 

*ఆర్టికల్ 47 మత్తు పానీయాల గురించి తెలుపుతుంది. 

*ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన

*ఆర్థిక ప్రజాస్వామ్యం ఆదేశిక సూత్రాల ద్వారా సాధించబడుతుంది. 

*రాజ్యాంగ పరిషత్తులో స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య- 93

*రాజ్యాంగ పరిషత్తులో 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

*రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన స్థానాల సంఖ్య: 202

*రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మవంటిదని పేర్కొన్నవారు- జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా

*భారత రాజ్యంగంలో పీఠికలో ఉన్న పదాలు: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర

*రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్

*రాజ్యాంగ రచనా కాలంలో మరణించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు- డి.పి ఖైతాన్

*రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. 

*రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి మొదట ప్రతిపాదించినది- క్రిప్స్ మిషన్

*ప్రవేశికలో 42వ సవరణ ద్వారా చేర్చిన పదాలు- సామ్యవాద, లౌకిక, సమగ్రత

*రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్- సర్దార్ పటేల్



Tags:    

Similar News