గ్రామపంచాతీల ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్..??

Update: 2022-03-04 08:49 GMT

ఆదేశిక సూత్రాల నుంచి గ్రూప్స్, పోలీస్ పరీక్షల్లో ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. 

*ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. 

*ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం సాంఘీకన్యాయం

*ఆదేశిక సూత్రాల్లో 48వ ఆర్టికల్ గోవధను నిషేధిస్తుంది. 

*ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

*మత్తు పానీయాల గురించి తెలిపే ఆర్టికల్- 47

*ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం- సంక్షేమ రాజ్య స్థాపన

*ఆర్థిక ప్రజాస్వామ్యం ఆదేశిక సూత్రాల ద్వారా సాధించబడుతుంది. 

*గ్రామ పంచాయితీల ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్-40

*ఆర్టికల్ 41- పనిహక్కు, నిరుద్యోగ నిర్మూలన

*ఆర్టికల్ 42- కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో శుభమైన వసతి

*ఆర్టికల్ 43- గౌరవప్రదమైన జీవన ప్రమాణం, సరైన వేతనాలు ప్రభుత్వ కల్పించాలి. 

*ఆర్టికల్ 44- ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటుకు ప్రభుత్వ చర్యలు

*ఆర్టికల్ 45- ఆరు సంవత్సరాల వయసు పూర్తి అయిన బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణకు విద్యావసతులు కల్పించడం

*ఆర్టికల్ 46-షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు, బలహీన వర్గాలకు విద్యా, ఆర్థిక అవకాశాలను ప్రభుత్వ పెంపొందించడం

*ఆర్టికల్ 47-ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ప్రజల ఆరోగ్య పరిస్థితులను పెంచడానికి ప్రభుత్వం చర్యలు

*ఆర్టికల్ 48-వ్యవసాయాన్ని, జంతు జాలాన్ని శాస్త్ర సాంకేతిక పద్థతుల ద్వారా రక్షించడానికి చర్యలు

*ఆర్టికల్ 49- చార్రితక, జాతీయ ప్రాధాన్యత గల ప్రదేశాలను కాపాడడం

*ఆర్టికల్ 50-కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయవ్యవస్థను వేరు చేసే చర్యలను ప్రభుత్వ చేపట్టడం

*ఆర్టికల్ 51- అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ














Tags:    

Similar News