IIM Jammu: ఐఐఎం జమ్మూలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
జమ్మూ కాశ్మీర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ(Indian Institute of Management Jammu)..లో ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ(Indian Institute of Management Jammu)..లో ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 16
- ఆపరేటర్-07
- ఐటీ టెక్నీషియన్-02
- ఐటీ ఇంజినీర్-01
- నెట్వర్క్ ఇంజినీర్-01
- అకౌంట్ అసిస్టెంట్-02
- ఎగ్జిక్యూటివ్- 02
- ఆడియో-వీడియో టెక్నీషియన్-01
విభాగాలు: ఏసీ/రిఫ్రిజిరెంట్, చిల్లర్/బాయిలర్, ఎస్ టీపీ, ఆర్ఓ/ డబ్ల్యూటీపీ, ఫైర్ అలారమ్ తదితర విభాగాలు.
అర్హత: ఇంటర్మీడియెట్, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం(Work Experience) ఉండాలి.
వయసు: ఆడియో-వీడియో టెక్నీషియన్ పోస్టుకు 38 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295.
ఎంపిక: విద్యార్హత, పని అనుభవం,, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్ లైన్ దరఖాస్తులను బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2024.
వెబ్ సైట్: https://www.becil.com/