UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ(TG) రాష్ట్రం హైదరాబాద్(HYD)లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ(TG) రాష్ట్రం హైదరాబాద్(HYD)లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 42 పోస్టులను డైరెక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://uohyd.ac.in/ ద్వారా ఆన్లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 16 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- ప్రొఫెసర్ - 20
- అసోసియేట్ ప్రొఫెసర్ - 21
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 22
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో జనరల్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు.. పని అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్, నెట్/ సెట్ ఎగ్సామ్ క్వాలిఫై అయి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.