హైదరాబాద్‌లో ఉచిత సివిల్స్ కోచింగ్.. పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదలైంది.
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 కోచింగ్‌ను ఎస్టీ స్టడీ సర్కిల్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది.
సీట్లు: 100 (ఎస్టీలకు 75శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 10 శాతం)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు మించరాదు.
వయసు: ఆగస్టు 15, 2024 నాటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 నుంచి 37 ఏళ్లు, బీసీలకు 21 నుంచి 35 ఏళ్లు, దివ్యాంగులకు 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జులై 8, 2023.
వెబ్‌సైట్: https://studycircle.cgg.gov.in/tstw