గ్రూప్-3 ఎడిట్ ఆప్షన్ కు.. రేపే లాస్ట్ డేట్!

గ్రూప్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు.. ఇదే చివరి అవకాశం.!

Update: 2024-09-05 13:46 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు.. ఇదే చివరి అవకాశం.! అభ్యర్థుల అప్లికేషన్లలో ఏవైనా సవరణలు ఉంటే.. దరఖాస్తు ఫారంలో ఎడిట్ చేసుకోవడానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. గ్రూప్-3 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కు రేపటితో(సెప్టెంబర్ 6) తో గడువు ముగియనుంది. కనుక, అప్లికేషన్ ఫారంలో ఏవైనా సవరణలు చేసుకోవలసి వస్తే, అభ్యర్థులు వెంటనే ఎడిట్ చేసుకోవాలి. దరఖాస్తుదారు ఫారం లో.. అభ్యర్థుల పేరు, జెండర్, పుట్టిన తేదీ వివరాలు, స్థానికత, PWD కేటగిరి వివరాలు, నాన్ క్రిమిలేయర్ స్టేటస్, స్పోర్ట్స్ కోటా వంటి తదితర వివరాలు ఏవైనా ఉంటే చివరి గడువు లోగా సరిదిద్దుకోవాలి.


Similar News