NMDC హైదరాబాద్లో 42 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఖాళీలు
హైదరాబాద్లోని ఎన్ఎండీసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దిశ,వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఎన్ఎండీసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెకానికల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు - 42
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ - 2022 అర్హత సాధించి ఉండాలి.
వయసు: 27 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 50,000 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
వెబ్సైట్: https://www.nmdc.co.in