DRDO జాబ్ నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ. లక్ష జీతం
డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ ఈ నోటిఫికేషన్ ద్వారా 181 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ ఈ నోటిఫికేషన్ ద్వారా 181 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 181
పోస్టుల వివరాలు:
అన్ రిజర్వ్‌డ్: 73
ఈడబ్ల్యూఎస్: 18
ఓబీసీ: 49
ఎస్సీ: 28
ఎస్టీ: 13
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గేట్ పరీక్షలో అర్హత ఉండాలి.
వయసు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్-28, ఓబీసీ-31, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ.1లక్ష చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్:https://rac.gov.in/
ఇవి కూడా చదవండి: