Bank Jobs: పరీక్ష లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ లో జాబ్ చేయాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. మొత్తం 273 పోస్టుల్లో భర్తీ చేయనుంది. మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్స్, FLC కౌన్సెలర్లు, FLC డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లోకి పూర్తి వివరాలను తెలుసుకోండి.
ముఖ్యమైన తేదీ:
ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి ముగింపు తేదీ : 26 మార్చి 2025
ఖాళీలు:
SBI రిలీజ్ చేసిన ఖాళీల్లో FLC కౌన్సెలర్ల పోస్టులకు గరిష్టంగా 263 ఖాళీలు ఉన్నాయి. FLC డైరెక్టర్ల 6 పోస్టులకు, రిటైల్ ఉత్పత్తుల మేనేజర్ 04 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 28 ఏళ్ళు ఉండాలి
గరిష్టంగా 40 ఏళ్ళు ఉండాలి.
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
జీతం :
SBIలో రిటైల్ ప్రొడక్ట్స్ సెలక్షన్ మేనేజర్ కి ప్రతి నెలా రూ. 1,05,280 జీతం ఇస్తారు.
FLC కౌన్సెలర్లకు ప్రతి నెలా రూ. 50,000 వేతనం ఇస్తారు.
FLC డైరెక్టర్లకు ప్రతి నెలా రూ. 75,000 వేతనం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా మీరు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కు వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఇచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ అడిగిన అన్ని సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత లాగిన్ అయి దరఖాస్తు ఫామ్ ను ఫిల్ చేయండి.