ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు, నెలకు రూ.70వేల వరకు వేతనం..

Update: 2022-02-11 04:05 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(APMDC)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ఉద్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 1

*ఇందులో డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లీగల్‌, మైనింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి డిగ్రీ, లా డిగ్రీ, బీటెక్, మైనింగ్ లో డిప్లొమా పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

*వయోపరిమితికి సంబంధించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.51000 నుంచి 70000 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

*ఆఫ్ లైన్ దరఖాస్తును APMDC, Kanur Village, Penamaluru Zone, Vijayawada 521137 చిరునామాకి పంపాలి.

*నోటిిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Tags:    

Similar News