NEET 2022 క్లియర్ చేయలేదా? మీ కోసమే ఈ ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్స్..
నీట్ దేశంలోనే అత్యంత పోటీతత్వ ప్రవేశ పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
దిశ, ఫీచర్స్ : నీట్ దేశంలోనే అత్యంత పోటీతత్వ ప్రవేశ పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు నీట్-యుజి పరీక్షకు హాజరైనా.. వీరిలో కొంతమంది మాత్రమే తుది జాబితాకు ఎంపికయ్యారు. 2022లో 18 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. కేవలం 9,93,069 మంది అభ్యర్థులు నీట్ 2022 పరీక్షకు అర్హత సాధించారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? లాంగ్ టర్మ్ కోర్సు తీసుకోవాల్సిందేనా? బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ గురించి నిపుణులు సలహాలు.. కోర్సుల డిటెయిల్స్ మీకోసం.
భారతదేశంలో 12వ తరగతి(ఇంటర్) తర్వాత వైద్య కోర్సులకు MBBS మరియు BDS అత్యంత సాధారణ ఎంపికలు. అయితే, నీట్ 2022 ప్రవేశ పరీక్ష రాసిన దాదాపు సగం మంది విద్యార్థులు అర్హత సాధించలేకపోయారు. ఒకవేళ అర్హత సాధించినా పరిమిత సీట్ల కారణంగా టాప్ మెడికల్ కాలేజీలలో ప్రవేశం పొందలేరు. ఈ క్రమంలో వైద్య విద్యను అభ్యసించడానికి తమ డ్రీమ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీట్ పొందలేకపోయినా లేదా నీట్‌కు అర్హత సాధించలేకపోయిన విద్యార్థులు.. వైద్య అధ్యయన రంగం కేవలం MBBSకి మాత్రమే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు. 2022 NEET అర్హత అవసరం లేని అనేక ఆప్షనల్ కోర్సులు ఉన్నాయన్న సంగతి మరిచిపోకూడదని సూచిస్తున్నారు.
నీట్ అవసరం లేని మెడికల్ కోర్సులు
- BSc నర్సింగ్
- BSc బయోటెక్నాలజీ
- BSc అనస్థీషియా
- BSc సైకాలజీ
- BSc బయోమెడికల్ సైన్స్
- సైటోజెనెటిస్టులు
- ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ
- మైక్రోబయాలజిస్ట్
- మెడిసినల్ కెమిస్ట్రీ
- మనస్తత్వవేత్త
- BPT (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)
- బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ
- బయోమెడికల్ ఇంజనీర్
- బయోటెక్నాలజిస్ట్
12th PCB తర్వాత NEET అవసరం లేని కోర్సులు:
- నర్సింగ్
- క్లినికల్ రీసెర్చ్
- టాక్సికాలజీ
- ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ
- MBA (హాస్పిటల్ & హెల్త్ మేనేజ్‌మెంట్)
- పాడిపరిశ్రమ
- ఆక్వాకల్చర్ మరియు ఫిషరీస్
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్
- BSc కార్డియాలజీ/BSc కార్డియాక్ టెక్నాలజీ
- పారామెడికల్ టెక్నాలజీలో బీఎస్సీ
- న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
- ప్రకృతి వైద్యం(నేచురో థెరపీ)
- ఫార్మసిస్ట్
- బయోమెడికల్ ఇంజనీర్
NEET లేకుండా మెడికల్ కోర్సులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా:
NEET UG పరీక్ష తీసుకోకుండా 12వ తరగతి తర్వాత మెడికల్ స్కూల్‌కు అర్హత సాధించాలంటే, విద్యార్థులు తప్పనిసరిగా అనేక రిక్వర్‌మెంట్స్ కలిగి ఉండాలి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:
- ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో PCB/PCM కలిగి ఉండాలి
- కొన్ని విశ్వవిద్యాలయాలలో, ప్రవేశ పరీక్షలు అవసరం కావచ్చు
- కొన్ని విశ్వవిద్యాలయాలకు కనీస ఉత్తీర్ణత శాతం అవసరం
NEET లేకుండా 12th PCB తర్వాత అధిక వేతన వైద్య కోర్సులు :
మీకు మెడికల్ ఫీల్డ్‌పై ఆసక్తి ఉంటే మరియు 12వ తరగతి తర్వాత అధిక ప్యాకేజీ కోర్సుల కోసం చూస్తున్నట్లయితే, NEET లేకుండా బయాలజీ విద్యార్థుల కోసం ఇక్కడ అనేక కోర్సులు ఉన్నాయి:
- BSc క్లినికల్ రీసెర్చ్
- BSc ఆడియాలజీ- స్నీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ
- బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ
- BSc క్లినికల్ సైకాలజీ
- BSc ఫోరెన్సిక్ సైన్స్
- BSc పారామెడికల్ టెక్నాలజీ
- BSc ఆప్టోమెట్రీ
- BSc మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
- BSc న్యూక్లియర్ మెడిసిన్
PCB విద్యార్థులకు ఇతర ఎంపికలు
విద్యార్థులకు వందలాది ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డిజైన్, లాంగ్వేజెస్, ఎకనామిక్స్, లా, హోటల్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్స్ మొదలైన రంగాల్లోనూ కెరీర్ చూజ్ చేసుకోవచ్చు.