గుడ్న్యూస్.. 458 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) - 458 పోస్టులు
దిశ,వెబ్డెస్క్: భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ).. కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 458 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు :
కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) - 458 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పేస్కేల్: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 ఉంటుంది.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్థాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 27, 2023
చివరితేదీ: జులై 26, 2023.
వెబ్సైట్: https://recruitment.itbpolice.nic.in