నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ కోస్టు గార్డులో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 80
*నోటిఫికేషన్ వెలుబడన ఒక నెల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
*సివిలియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజిన్ డ్రైవర్ 8, సారంగ్ లాస్కర్ 3, స్టోర్ కీపర్ గ్రేడ్ II 4, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 24, ఫైర్‌మ్యాన్ 6, ICE ఫిట్టర్ 6, స్ప్రే పెయింటర్ 1, MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్ 6, MTS 19, షీట్ మెటల్ వర్కర్ 1, ఎలక్ట్రికల్ ఫిట్టర్1, లేబర్ 1 ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai- 600009 చిరునామాకి పంపాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.