సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*పోస్టుల సంఖ్య: 4
*ఇందులో సివిల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33000 నుంచి రూ.40000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.icsi.edu/home/ వెబ్ సైట్ ను చూడొచ్చు.