JEE అడ్వాన్స్‌డ్ 2024 రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌లో మార్పు.. ఈ తేదీ నుంచి దరఖాస్తులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను సవరించింది.
దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను సవరించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, JEE అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. అలాగే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 7, 2024. ఇంతకు ముందు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగాల్సి ఉండగా ఇప్పుడు దాన్ని మార్చారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో విడుదల చేసిన సవరించిన షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.
పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు చేయలేదు. JEE అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష 26 మే 2024న దేశవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి షిప్టులో పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టులో పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పై లోక్‌సభ ఎన్నికల ప్రభావం చూపబోవని, ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని ఐఐటీ మద్రాస్ ఇటీవలే తెలియజేసింది.
JEE అడ్వాన్స్‌డ్ 2024 కోసం ఎలా నమోదు చేసుకోవాలి ?
JEE అడ్వాన్స్‌డ్ jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.
హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
వివరాలను నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
తరువాత పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించండి.
JEE అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదల...
JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష 2024కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం రూ.3200 ఫీజు నిర్ణయించారు. మహిళలు, రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1600. అడ్మిట్ కార్డ్ మే 17 ఉదయం 10 గంటలకు జారీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మరింత సమాచారం కోసం మీరు JEE అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.