BARC: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్‌లు.. పూర్తి వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్నటువంటి 36 నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ సబ్ ఆఫీసర్ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, BSc., M.Sc అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
మొత్తం పోస్ట్‌లు: 36
నర్సు/A- 13
సైంటిఫిక్ అసిస్టెంట్/B (పాథాలజీ)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్/B (సివిల్)- 8
సైంటిఫిక్ అసిస్టెంట్/B (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 8
సబ్-ఆఫీసర్/B - 4
సైంటిఫిక్ అసిస్టెంట్/C (మెడికల్ సోషల్ వర్కర్)- 1
అర్హత: విభాగాన్ని బట్టి 60 శాతం మార్కులతో B.Sc/మెడికల్ సోషల్ వర్క్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ/సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/HSC (10+2) (సైన్స్ అండ్ కెమిస్ట్రీ)/డిప్లొమా ఇన్ నర్సింగ్.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఆగస్టు 2022.
చివరి తేదీ: 12 సెప్టెంబర్ 2022.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 150.
SC/ST, PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
పే స్కేల్: విభాగాన్ని బట్టి రూ. 35,400 నుంచి రూ. 44,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
విభాగాల వారీగా అర్హత, ఇతర వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.barc.gov.in/ లేదా https://www.barc.gov.in/careers/vacancy21.pdf ను చూడగలరు.