BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!

గవర్నమెంట్ జాబ్స్(Government Jobs)కు ప్రిపేర్ అవుతున్నవారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-11-01 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: గవర్నమెంట్ జాబ్స్(Government Jobs)కు ప్రిపేర్ అవుతున్నవారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గుడ్ న్యూస్ చెప్పింది. ఘజియాబాద్(Ghaziabad)లోని బెల్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bel.alobhatech.com/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 9 నవంబర్ 2024. అహ్మదాబాద్Ahmedabad, బెంగళూరు(Bangalore), కోల్‌కతా(Kolkata), దిల్లీ( Delhi) నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టు పేరు, ఖాళీలు:

  • ట్రెయినీ ఇంజినీర్(Trainee Engineer) -  49 పోస్టులు
  • ప్రాజెక్టు ఇంజినీర్(Project Engineer)  -   28 పోస్టులు

విద్యార్హత:

పోస్టును బట్టి బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

ట్రెయినీ ఇంజినీర్ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 32 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

ట్రెయినీ ఇంజినీర్ పోస్టుకు రూ. 150+ జీఎస్టీ, ప్రాజెక్టు ఇంజినీర్, పోస్టుకు రూ. 400+జీఎస్టీ ఉంటుంది.

జీతం:

ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు సెలెక్ట్ అయినవారికి రూ.40,000 సాలరీ ఉంటుంది.

Tags:    

Similar News