Bank of Baroda Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!
మీరు డిగ్రీ/సీఏ/పీజీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్(Bank Job) కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త.
దిశ, వెబ్‌డెస్క్: మీరు డిగ్రీ/సీఏ/పీజీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్(Bank Job) కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 592 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 19 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ - 140
- డిజిటల్ గ్రూప్ - 139
- రిసీవబుల్ మేనెజ్మెంట్ - 202
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 31
- కార్పొరేట్, క్రెడిట్ విభాగం - 79
- ఫైనాన్స్ - 1
విద్యార్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ/సీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
పోస్టును బట్టి అభ్యర్థుల వయసు 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. వచ్చిన అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన వారిని ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.