సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, హెచ్ఆర్‌డీ విభాగం.. 2023 - 24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, హెచ్ఆర్‌డీ విభాగం.. 2023 - 24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), మెకానికల్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ ట్రేడులలో ఈ శిక్షణ ఇస్తారు.
వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి వ28 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ. 7,700 నుంచి రూ. 8050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా..సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటిఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు: ఎస్‌సీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీ, సంబంధిత సర్టిఫికెట్‌లను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/కొరియర్/వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయాలి.
వివరాలకు వెబ్‌సైట్: https://scclmines.com