Railway Apprentice recruitment 2023 Notification:. ఇండియన్ రైల్వేలో 3,624 పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ).. వెస్ట్రన్ రైల్వే 2023- 24 ఏడాదికి డివిజన్/వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ).. వెస్ట్రన్ రైల్వే 2023- 24 ఏడాదికి డివిజన్/వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు :
అప్రెంటిస్ ఖాళీలు: 3,624
ట్రేడులు ఇవే: ఫిట్టర్; వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ - మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), పీఏఎస్ఎస్ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్.
అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 26, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ : ఒక ఏడాది ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటిఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/వైవా లేదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: జూన్ 27, 2023
చివరితేదీ: జులై 26, 2023
వెబ్‌సైట్: https://www.rrc-wr.com/