331 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 14 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2023-06-29 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 14 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 331 పోస్టులను జూలై 5, 7, 10 తేదీలలో ఏపీవీవీపీ కమిషనర్ కార్యాలయము,గొల్లపూడి, విజయవాడలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని..సంబంధిత పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు నమూనాను cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

‘ఇప్పుడు నిర్వహించబోతున్న కాంట్రాక్టు నియామకాలకు స్థానికత, రోస్టర్ విధానం నుండి ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని తెలిపారు. రెగ్యులర్ ప్రాతిపదికన చేసే నియామకాలకు టైం స్కేల్ ఆఫ్ పే, ఇతర అలవెన్సులతో పాటు గిరిజన ప్రాంతాలలో 50 శాతం అదనపు జీతం ఇస్తారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్టు విధానంలో పోస్టులకు రెండున్నర లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు నెలవారీ జీతం ఇస్తారని తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ వాక్ ఇన్ రిక్రూట్మెంట్‌లో పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి అని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో రిటైర్ అయి 70 ఏళ్ల లోపు వయసున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News