భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 91 ఉద్యోగాలు.. మంచి వేతనం, దరఖాస్తు వివరాలివే
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో పలు ఉద్యోగాల91 jobs in Bharat Electronics Limited
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 91
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 20
*ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ- 66, టెక్నీషియన్- 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఇంజనీరింగ్ ట్రైనీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్లకు మించకూడదు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు.
*టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐతోపాటు, ఎస్‌ఎస్‌ఎల్‌టీ, అప్రెంటిస్‌షిప్ ట్రైనీగా సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500 నుంచి రూ.82,000 వేతనంగా చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.bel-india.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.