కొత్త వాహన కొనుగోలుదారులకు భారీ షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభయ్యే ఏప్రిల్ 1 నుంచి ఆటో పరిశ్రమలో వాహనాల ధరలు పెరగనున్నాయి. ముడి సరుకు ధరలు, వస్తువుల ధరలు పెరగడంతో ఇప్పటికే పలు కార్లు, టూ-వీలర్ తయారీ కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఏడాది ప్రారంభంలో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును ప్రకటించగా, తాజాగా మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. చాలావరకు వినియోగదారులపై భారాన్ని ఉంచకూడదని భావించిన కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నట్టు […]

Update: 2021-03-24 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభయ్యే ఏప్రిల్ 1 నుంచి ఆటో పరిశ్రమలో వాహనాల ధరలు పెరగనున్నాయి. ముడి సరుకు ధరలు, వస్తువుల ధరలు పెరగడంతో ఇప్పటికే పలు కార్లు, టూ-వీలర్ తయారీ కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఏడాది ప్రారంభంలో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును ప్రకటించగా, తాజాగా మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. చాలావరకు వినియోగదారులపై భారాన్ని ఉంచకూడదని భావించిన కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నట్టు చెబుతున్న్నాయి. ఇప్పటికే దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి పలు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలను పెంచాలని నిర్ణయించింది.

మరో సంస్థ నిస్సాన్ కూడా తన కొత్త ఎస్‌యూవీఅ ధరలను వేరియంట్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని తెలిపింది. దిగ్గజ టూ-వీలర్ సంస్థ హీరో మోటో కార్ప్ కూడా ధరలను పెంచనున్నట్టి ప్రకటించింది. అదే బాటలో ప్రీమియం బైక్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కాంటినెంటల్ జీటీ650, ఇంటర్‌సెప్టార్ 650 వేరియంట్‌లపై 2 శాతం మేర ధరలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇదే బాటలో వ్యవసాయాధిరిత వాహన తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ ట్రాక్టర్ ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. వస్తువూ ధరలు పెరగడం ఈ పెంపునకు కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ధరల పెరుగుదల మోడల్, వేరియంట్‌ను బట్టి ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News