పోలీసుల అదుపులో కారు డ్రైవర్!
దిశ,వికారాబాద్: ఆదివారం రాత్రి తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతను ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నట్లు, అది పోలీసుల అదుపులో ఉన్నాడని నవాజ్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి ప్రాణపాయం నుంచి బయట పడిన రాఘవేందర్‌రెడ్డి, నవాజ్‌రెడ్డి కుటుంబానికి భయపడి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొందరి సహకారంతో తలదాచుకున్న డ్రైవర్ చివరకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. పోలీసులు రాఘవేందర్ […]
దిశ,వికారాబాద్: ఆదివారం రాత్రి తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతను ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నట్లు, అది పోలీసుల అదుపులో ఉన్నాడని నవాజ్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
రాత్రి ప్రాణపాయం నుంచి బయట పడిన రాఘవేందర్‌రెడ్డి, నవాజ్‌రెడ్డి కుటుంబానికి భయపడి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొందరి సహకారంతో తలదాచుకున్న డ్రైవర్ చివరకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. పోలీసులు రాఘవేందర్ రెడ్డి తమ అదుపులో పెట్టుకొని ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.