జీతాలివ్వలేం: పైలట్లకు స్పైస్‌జెట్ షాక్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. ఫైలట్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేమని వారికి తేల్చిచెప్పింది. దీంతో పైలట్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం సరుకు రవాణా విమానాలు నడుపుతున్న పైలట్లకు, అది కూడా పనిచేసిన గంటల ప్రకారమే జీతం చెల్లిస్తున్నామని స్పైస్‌జెట్ ప్రకటించింది. కేవలం 5 కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నట్లు, ప్రయాణికుల విమానాల సీట్లపైనే సరకులను ఉంచి రవాణా చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి మొత్తం విమానాల్లో కేవలం 16 శాతం […]
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. ఫైలట్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేమని వారికి తేల్చిచెప్పింది. దీంతో పైలట్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం సరుకు రవాణా విమానాలు నడుపుతున్న పైలట్లకు, అది కూడా పనిచేసిన గంటల ప్రకారమే జీతం చెల్లిస్తున్నామని స్పైస్‌జెట్ ప్రకటించింది. కేవలం 5 కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నట్లు, ప్రయాణికుల విమానాల సీట్లపైనే సరకులను ఉంచి రవాణా చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి మొత్తం విమానాల్లో కేవలం 16 శాతం విమాన సర్వీసులు నడుస్తున్నాయని, 20 శాతం పైలట్లు మాత్రమే విధుల్లో ఉన్నట్లు స్పైస్ జెట్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గురుచరణ్ అరోరా వెల్లడించారు.
Tags: spice jet, pilot, salary, may, april