కుటుంబ నియంత్రణపై ప్రజలను బలవంత పెట్టలేం: కేంద్రం

దిశ,వెబ్ డెస్క్: జనాభా నియంత్రణపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కుటుంబ నియంత్రణపై ప్రజలను బలవంత పెట్టలేమని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. ఎందరు పిల్లలు కావాలో పూర్తిగా దంపతుల ఇష్టమేనని కేంద్రం పేర్కొంది. నిబంధనలు విధిస్తే జనాభా వక్రీకరణకు దారి తీసే ప్రమాదం ఉందని కేంద్రం చెప్పింది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2000లో ఎన్‌పీపీ సమయంలో సంతానోత్పత్తి రేటు 3.2 శాతంగా ఉందనీ..2018 […]

Update: 2020-12-12 06:05 GMT

దిశ,వెబ్ డెస్క్: జనాభా నియంత్రణపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కుటుంబ నియంత్రణపై ప్రజలను బలవంత పెట్టలేమని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. ఎందరు పిల్లలు కావాలో పూర్తిగా దంపతుల ఇష్టమేనని కేంద్రం పేర్కొంది. నిబంధనలు విధిస్తే జనాభా వక్రీకరణకు దారి తీసే ప్రమాదం ఉందని కేంద్రం చెప్పింది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2000లో ఎన్‌పీపీ సమయంలో సంతానోత్పత్తి రేటు 3.2 శాతంగా ఉందనీ..2018 నాటికి ఈ రేటు 2.2 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

Tags:    

Similar News