వైద్యశాఖ కీలక నిర్ణయం.. అన్ని జిల్లాలకు క్యాన్సర్ స్పెషలిస్టులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్పెషలిస్టులను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే క్యాన్సర్ స్పెషలిస్టులు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ అతి త్వరలో నియమించబోతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఓ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటిలో స్క్రీనింగ్, డయగ్నోసిస్, ట్రీట్మెంట్ అనే మూడు లెవల్స్‌ను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్పెషలిస్టులను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే క్యాన్సర్ స్పెషలిస్టులు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ అతి త్వరలో నియమించబోతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఓ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటిలో స్క్రీనింగ్, డయగ్నోసిస్, ట్రీట్మెంట్ అనే మూడు లెవల్స్‌ను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కేన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దశల వారీగా ప్రతి పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థాయి నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ విధానం అమలులోకి తెచ్చే ప్రపోజల్స్ కూడా ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. వీటిని నేషనల్ హెల్త్ మిషన్ స్కీం ద్వారా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటి విధానాలను వేగంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి క్యాన్సర్ పేషెంట్లు పెరగడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఓ అధికారి తెలిపారు.