ఆడపిల్లలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

దిశ, తెలంగాణ బ్యూరో : అవగాహనతోనే క్యాన్సర్ నివారణ సాధ్యమని, ఆ బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ ఆధ్వర్యంలో శనివారం జలవిహార్ నుంచి టోల్ప్లాజా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పై నిర్వహించిన అవేర్నెస్ వాక్ కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, […]

Update: 2021-10-08 22:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అవగాహనతోనే క్యాన్సర్ నివారణ సాధ్యమని, ఆ బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ ఆధ్వర్యంలో శనివారం జలవిహార్ నుంచి టోల్ప్లాజా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పై నిర్వహించిన అవేర్నెస్ వాక్ కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉందన్నారు. ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని సూచించారు. తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ ఎన్ జే క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆసుపత్రి ఇంచార్జీ జయలలితకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News