ప్రధాని విగ్రహం ధ్వంసం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షను నిరసిస్తూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలు కెనడాలోనూ ఉదృతం అవుతున్నాయి. మాంట్రియల్ నగరంలో దేశ తొలి ప్రధాని సర్ జాన్ ఏ మెక్ డోనాల్డ్ విగ్రహాన్ని కొందరు కార్యకర్తలు ధ్వంసం చేశారు. 1867, 1891 మధ్యకాలంలో 19 ఏళ్లు కెనడా ప్రధానిగా మెక్ డోనాల్డ్ సేవలందించారు. ఈయనే కెనడా తొలి ప్రధాని. అయితే, మెక్ డోనాల్డ్ హయాంలో వివక్షాపూరిత విధానాలను అవలంబించారని ఆరోపణలున్నాయి. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యానంతరం […]

Update: 2020-08-30 10:51 GMT

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షను నిరసిస్తూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలు కెనడాలోనూ ఉదృతం అవుతున్నాయి. మాంట్రియల్ నగరంలో దేశ తొలి ప్రధాని సర్ జాన్ ఏ మెక్ డోనాల్డ్ విగ్రహాన్ని కొందరు కార్యకర్తలు ధ్వంసం చేశారు. 1867, 1891 మధ్యకాలంలో 19 ఏళ్లు కెనడా ప్రధానిగా మెక్ డోనాల్డ్ సేవలందించారు. ఈయనే కెనడా తొలి ప్రధాని.

అయితే, మెక్ డోనాల్డ్ హయాంలో వివక్షాపూరిత విధానాలను అవలంబించారని ఆరోపణలున్నాయి. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యానంతరం ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనలు మరోసారి మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఆందోళనకారులు ఏకమై సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి మెక్ డోనాల్డ్ విగ్రహానికి తాడు కట్టి లాగి కూల్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags:    

Similar News