అనురాగ్‌లో క్యాంపస్ డ్రైవ్.. రూ.2.4 లక్షలతో ఎంపిక
దిశ, అనంతగిరి: అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్సెలా కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్‌లో ఫార్మసీ విభాగంలో సైంటిఫిక్ డాటా అనలిస్ట్ కోసం ఎక్సెలా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌కు 80 మంది విద్యార్థులు హాజరుకాగా 22 మంది అర్హత సాధించారు. సాంకేతిక ఇంటర్వ్యూలో ఐదుగురు విద్యార్థులు సైంటిఫిక్ అనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం రూ.2.4 లక్షలు ఇవ్వనున్నట్లు కంపెనీ విభాగం అధికారులు తెలిపారు. అనంతరం అర్హత […]
దిశ, అనంతగిరి: అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్సెలా కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్‌లో ఫార్మసీ విభాగంలో సైంటిఫిక్ డాటా అనలిస్ట్ కోసం ఎక్సెలా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌కు 80 మంది విద్యార్థులు హాజరుకాగా 22 మంది అర్హత సాధించారు. సాంకేతిక ఇంటర్వ్యూలో ఐదుగురు విద్యార్థులు సైంటిఫిక్ అనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం రూ.2.4 లక్షలు ఇవ్వనున్నట్లు కంపెనీ విభాగం అధికారులు తెలిపారు.
అనంతరం అర్హత సాధించి, జాబ్ సంపాదించిన అభ్యర్థులను కళాశాల కరస్పాండెంట్ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి అభినందించారు. ఈ డ్రైవ్‌ను కంపెనీ ప్రతినిధులు, టెక్నికల్ అసిస్టెంట్లు గోపాల్ శ్రీనివాస్, పవన్, హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్న ఈశ్వరయ్య ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. కళాశాల టీపీఓ విద్యాసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.