కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్ : మోడీ ప్రభుత్వం అమ్మాయిలకు తీపి కబురును అందించింది. అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమ్మాయిల వివాహ వయసు పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి నుంచి అమ్మాయిల వివాహ వయసు 21 కానున్నట్టు తెలుస్తోంది. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, […]
దిశ, వెబ్‌డెస్క్ : మోడీ ప్రభుత్వం అమ్మాయిలకు తీపి కబురును అందించింది. అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమ్మాయిల వివాహ వయసు పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి నుంచి అమ్మాయిల వివాహ వయసు 21 కానున్నట్టు తెలుస్తోంది. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమ్మాయి పెళ్లి వయసును 21సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజాగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశాల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టే అవకాశం ఉంది.