‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఢోకా లేదు’
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించి పోయిన సమయంలో క్రీడలు కూడా నిలిచిపోయాయి. ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. అయితే, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎలాంటి ఢోకా లేదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించి పోయిన సమయంలో క్రీడలు కూడా నిలిచిపోయాయి. ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. అయితే, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎలాంటి ఢోకా లేదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లను ఆరుకు పెంచాలని ఆస్ట్రేలియా కోరుతున్నా.. బీసీసీఐ మాత్రం స్పందించలేదు. డిసెంబర్ 26న జరిగే బాక్సింగ్ డే టెస్టు కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగానే జరుగనుంది. మరోవైపు ఇంగ్లాండ్‌కు కూడా పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం జట్టును పంపుతామని ఆయన స్పష్టం చేశారు. ఏదో ఒక దశలో క్రికెట్ ఆరంభం కావాలి.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా వంటి జట్లు ఆటను ప్రారంభిస్తేనే చిన్న జట్లు కూడా ముందుకు వస్తాయని ఆయన చెప్పారు. ప్రేక్షకులు లేకుండా అయినా ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.