Tictok బ్యాన్ చేసేందుకు కుట్ర : బైట్‌డాన్స్
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని దాని మాతృసంస్థ బైట్ డాన్స్ ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ ఇమింగ్ తన సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నారు. టిక్‌టాక్‌ను అమ్ముకునేలా సంస్థ పై ఒత్తిడి తీసుకురావడం అమెరికా లక్ష్యం కాదని, ఎలాగైనా యాప్‌ను బ్యాన్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. అయితే ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి నెలకొన్న అన్ని సమస్యలను తీర్చుకునేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఇమింగ్ తెలిపారు. […]
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని దాని మాతృసంస్థ బైట్ డాన్స్ ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ ఇమింగ్ తన సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నారు. టిక్‌టాక్‌ను అమ్ముకునేలా సంస్థ పై ఒత్తిడి తీసుకురావడం అమెరికా లక్ష్యం కాదని, ఎలాగైనా యాప్‌ను బ్యాన్ చేయాలని చూస్తోందని ఆరోపించింది.
అయితే ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి నెలకొన్న అన్ని సమస్యలను తీర్చుకునేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఇమింగ్ తెలిపారు. అంతేకాకుండా టిక్‌టాక్‌ను వేరేవారికి విక్రయించడంపై కూడా సంస్థ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని, దానిపై మరింత ఆలోచన చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.