ర్యాంకులు మెరుగుపర్చుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు
దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) మంగళవారం పలు విభాగాల్లో ర్యాంకులు ప్రకటించింది. భారత మిక్స్‌డ్ డబుల్ జోడి సాత్వీక్ సాయిరాజ్, అశ్విని పొన్నప్పలు తమ ర్యాంకును మెరుగుపర్చుకొని టాప్-20లోకి ప్రవేశించారు. టొయోటో థాయిలాండ్ ఓపెన్ సెమీస్‌లోకి ఈ జంట ప్రవేశించడంతో గత ర్యాంకు కంటే 16 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి చేరారు. ఇక థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు మెన్స్ డబుల్ జోడి సాత్విక్, చిరాగ్ షెట్టి చేరారు. దీంతో ప్రపంచ నెంబర్ […]
దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) మంగళవారం పలు విభాగాల్లో ర్యాంకులు ప్రకటించింది. భారత మిక్స్‌డ్ డబుల్ జోడి సాత్వీక్ సాయిరాజ్, అశ్విని పొన్నప్పలు తమ ర్యాంకును మెరుగుపర్చుకొని టాప్-20లోకి ప్రవేశించారు. టొయోటో థాయిలాండ్ ఓపెన్ సెమీస్‌లోకి ఈ జంట ప్రవేశించడంతో గత ర్యాంకు కంటే 16 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి చేరారు.
ఇక థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు మెన్స్ డబుల్ జోడి సాత్విక్, చిరాగ్ షెట్టి చేరారు. దీంతో ప్రపంచ నెంబర్ 10 ర్యాంకును నిలబెట్టుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 7వ ర్యాంకులోనే కొనసాగుతున్నది. సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 19వ ర్యాంకుకు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఒక స్థానం ఎగబాకి 13వ స్థానానికి చేరాడు.
థాయిలాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ద్వారా సమీర్ వర్మ 4 ర్యాంకులు మెరుగుపర్చుకొని 27వ స్థానానికి చేరుకున్నాడు. థాయిలాండ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓడిపోయిన బి. సాయి ప్రణీత్ 16వ ర్యాంకు నుంచి 17కు పడిపోయాడు. పారుపల్లి కశ్యప్ 24వ ర్యాంకు నుంచి 26కు పడిపోయాడు. ఇక పురుషుల డబుల్స్ జోడి అర్జున్, ధృవ్ కపిల 33 స్థానాలు ఎగబాకి 64వ ర్యాంకుకు చేరుకున్నారు. కాగా, టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించడానికి మే 18న ప్రకటించే ర్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించే స్విస్ ఓపెన్ మొదలుకొని మే 11 నుంచి 16 వరకు నిర్వహించే ఇండియన్ ఓపెన్‌లో ప్రదర్శనల పైనే ర్యాంకులు ఆధారపడి ఉంటాయి.