Zee-Sony: విలీనం ఒప్పందంలో వివాదాలను పరిష్కరించుకున్న జీ-సోనీ

వివాదాలను పక్కనపెట్టి వ్యాపారాల నిర్వహణపై దృష్టి సారించాలని చర్చించుకున్నాయి

Update: 2024-08-27 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మీడియా రంగంలో దిగ్గజాలైన జీ-సోనీ తమ మధ్య నెలకొన్న వివాదాలను ఎట్టకేలకు పరిష్కరించుకున్నాయి. విలీన ఒప్పందం రద్దయిన తర్వాత ఇరు సంస్థల మధ్య సమస్యలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నాయి. తాజాగా వివాదాలను పక్కనపెట్టి వ్యాపారాల నిర్వహణపై దృష్టి సారించాలని చర్చించుకున్నాయి. విలీన ఒప్పందం రద్దు తర్వాత పరస్పరం పెట్టుకున్న కేసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సహా పలు న్యాయాస్థానల్లో దాఖలైన కేసులను వెనక్కి తీసుకోనున్నాయి. కాగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సోనీ పిక్చర్స్ నెట్‌వర్స్క్ ఇండియా దాదాపు రూ. 83 వేల కోట్లకు విలీన ఒప్పందం చేసుకున్నాయి. అయితే 2 సంవత్సరాల తర్వాత ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు సోనీ గ్రూప్ ఈ ఏడాది ప్రారంభంలో తెలిపింది. సోనీ నిర్ణయంతో ఇరు సంస్థల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు కేసులు వేస్తూ కోర్టులను ఆశ్రయించాయి. అనేక దశల్లో చర్చల అనంతరం తాజాగా వివాదాలను పక్కన పెట్టి సామరస్యంగా వ్యాపారాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. ఈ ప్రకటనతో మంగళవారం ట్రేడింగ్‌లో జీ కంపెనీ షేర్లు 11 శాతానికి పైగా పుంజుకున్నాయి.

Tags:    

Similar News