Pakistan : ‘ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్’

దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది.

Update: 2023-09-23 09:32 GMT

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాలు, విద్యుత్ ధరలు మొదలగు వాటి వల్ల పాకిస్తాన్ క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కొన్ని వర్గాల స్వార్థ ప్రయోజనాలతో దేశ ప్రజల్లో 40 శాతం జనాభా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోయారని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ పెట్టుబడి మార్గాలు అన్వేషించి, రుణాలు పొందాలని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది, కాబట్టి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తుంది.

పాకిస్తాన్ మానవాభివృద్ధి ఫలితాలు దక్షిణాసియాలోని మిగిలిన ప్రాంతాల కంటే బాగా వెనుకబడి ఉన్నాయి. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు బయట ఉన్నారు. వారి ఎదుగుదల కుంటుపడింది. వివిధ వర్గాల స్వార్థ ప్రయోజనాల కారణంగా దేశంలో అభివృద్ధి ఆగిపోయింది. అయితే త్వరలో ఎన్నికలు రానున్నాయి. రాబోయే కొత్త ప్రభుత్వం అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాముల ద్వారా ఫైనాన్సింగ్ పొంది, కఠినమైన నిర్ణయాలను తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ పతనం నుంచి కోలుకునే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ సలహా ఇస్తుంది.

Tags:    

Similar News