Waaree Energies: లక్ష కోట్లకు చేరుకున్న వారీ ఎనర్జీస్ మార్కెట్ వాల్యూ

సోలార్ ప్యానెళ్ల(Solar Panels) తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) ఇటీవలే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-11-06 12:47 GMT

దిశ, వెబ్ డెస్క్: సోలార్ ప్యానెళ్ల(Solar Panels) తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) ఇటీవలే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 4,321 కోట్లను సమీకరించేందుకు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఐపీఓలో లిస్ట్ అయినా వారం రోజుల్లోనే షేర్లు ట్రేడింగ్ సెషన్(Trading Session)లో దూసుకెళ్తున్నాయి. ఆ సంస్థ షేర్లు 49 శాతం మేర రాణించడంతో కంపెనీ వాల్యూ ఏకంగా లక్ష కోట్లకు చేరుకుంది. కాగా వారీ ఎనర్జీస్ ఐపీఓ అక్టోబర్ 28న 70 శాతం లాభంతో లిస్ట్ అయ్యింది. ఒక్కో షేర్ ధరను రూ. 1503గా కంపెనీ ఖరారు చేయగా.. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్(NSE)లో 66.33 శాతం లాభంతో రూ. 2500 వద్ద నమోదైంది. ఇక బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(BSE)లో 69.66 శాతం ప్రీమియంతో రూ. 2550 వద్ద లిస్ట్ అయ్యింది. వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో సంస్థ షేర్లు రాణించడంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,03,779.62 కోట్లకు చేరుకుంది. ఆ సంస్థ ఈ ఒక్క రోజే రూ. 271 కోట్లకు పైగా లాభాలను ఆర్జించడం విశేషం. కాగా వారీ ఎనర్జీస్ సంస్థకు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. మన దేశంలో సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలో వారీ ఎనర్జీస్ ఒకటిగా పేరు గాంచింది.

Tags:    

Similar News