Vodafone Idea Q2 Results: రెండో త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియాకు రూ. 7,176 కోట్ల నష్టం..!

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది.

Update: 2024-11-13 14:52 GMT
Vodafone Idea Q2 Results: రెండో త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియాకు రూ. 7,176 కోట్ల నష్టం..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల్లో ఆ సంస్థ రూ. 7,176 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కాగా గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 8,746.6 కోట్లతో పోలిస్తే ఈ సారి నష్టాలు స్వల్పంగా తగ్గాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక ఈ త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 10,716 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ. 10,932 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అలాగే ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం(ARPU) రూ. 154 నుంచి రూ. 166కి పెరిగిందని వెల్లడించింది. జులైలో రీఛార్జ్ రేట్ల పెంచడంతో సగటు ఆదాయం పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. కాగా త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్ఎస్ఈ(NSE)లో కంపెనీ షేర్ వాల్యూ 3.65 శాతం తగ్గి రూ. 7.39 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News