Vodafone Idea: ఎరిక్సన్‌తో వొడాఫోన్ ఐడియా రూ. 14 వేల కోట్ల ఒప్పందం
నెట్‌వర్క్ పరికరాల కంపెనీ ఎరిక్సన్‌తో మూడేళ్ల కాలానికి వొడాఫోన్ ఐడియారూ. 14,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వేగంగా పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 4జీ నెట్‌వర్క్ విస్తరణతో పాటు 5జీ సేవల కోసం కీలక నిర్ణయం తీసుకుది. నెట్‌వర్క్ పరికరాల కంపెనీ ఎరిక్సన్‌తో మూడేళ్ల కాలానికి వొడాఫోన్ ఐడియారూ. 14,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఎరిక్సన్ కంపెనీ 4జీ, 5జీ బేస్ స్టేషన్లను వొడాఫోన్ ఐడియాకు సరఫరా చేయనుంది. అలాగే, 4జీని అప్‌గ్రేడ్ చేసి కార్యకలాపాలను బలోపేతం చేయడం, 5జీ ప్రారంభించేందుకు సహకారం అందించనుంది. దీని ద్వారా వొడాఫోన్ ఐడియా మరింత విస్తరించడమే కాకుండా మార్కెట్ వాటాను పెంచుకోనుందని ఎరిక్సన్ ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో వొడాఫోన్ ఐడియా 4జీ, 5జీ పరికరాల కోసం నోకియాతో కూడా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.