ఏడాది కనిష్టానికి పడిపోయిన భారత నిరుద్యోగిత రేటు: సీఎంఐఈ!

దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌లో ఏడాది కనిష్టానికి పడిపోయింది.

Update: 2023-10-02 10:51 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌లో ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఋతుపవనాలు బలహీనంగా ఉన్న కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం దెబ్బతినడమే ఇందుకు కారణమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) డేటా వెల్లడించింది. ఆ సంస్థ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్‌లో నిరుద్యోగ రేటు 7.09 శాతానికి క్షీణించింది.

అంతకుముందు ఆగష్టులో 8.10 శాతంగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్పం. గ్రామీణ నిరుద్యోగ రేటు 7.11 శాతం నుంచి 6.20 శాతానికి పట్టణ నిరుద్యోగం 10.09 శాతం నుంచి 8.94 శాతానికి తగ్గింది. దేశీయంగా కీలకమైన పండుగ సీజన్‌కు ముందు పట్టణ నిరుద్యోగం కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.


Similar News