Large Cap Stocks: రాబోయే రోజుల్లో లాభాల బాట పట్టే అవకాశమున్న ఐదు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవే..

గత కొన్ని రోజులుగా నష్టాల్లో ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల పట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-10-08 17:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా నష్టాల్లో ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల పట్టిన విషయం తెలిసిందే. దీంతో వరుస నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అంచనా వేయడం కష్టమే. ఒక్కోసారి హఠాత్తుగా కుప్పకూలుతాయి. మరికొన్ని సార్లు లాభాల బాట పడుతుంటాయి. అందుకే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మదుపర్లు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ తో పోల్చితే ఇందులో రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నష్టాలు వచ్చిన మళ్లీ రికవరీ అవుతాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ ను కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు ఆ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

LIC: ఎల్ఐసీ షేరు ధర ప్రస్తుతం రూ. 942 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో 45 శాతం వరకు వృద్ది చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 5.96 లక్షల కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ట షేరు ధర రూ. 1,222 గానూ, 52 వారాల కనిష్ట షేరు ధర రూ. 597 గానూ ఉంది.

Canara Bank Ltd: కెనరా బ్యాంక్ లిమిటెడ్ షేరు ధర ప్రస్తుతం రూ. 104 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో 40 శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 129 గానూ, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 68 గానూ ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 94,650 కోట్లుగా ఉంది.

Reliance Industries Ltd: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ధర ప్రస్తుతం రూ. రూ. 2,776 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో 38 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువ రూ. 18.78 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 3,217 గానూ, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 2,220 గానూ ఉంది.

Maruti Suzuki India Ltd: మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ షేరు ధర ప్రస్తుతం రూ. 12,555 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో 37 శాతం పెరగవచ్చని 39 మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 13,680 గానూ, 52 వారాల కనిష్ట స్థాయి రూ 9,737 గానూ ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 3.95 లక్షల కోట్లుగా ఉంది.

SBI Life Insurance Company Ltd: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ షేరు ధర ప్రస్తుతం రూ. 1,745 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో 37 శాతం వరకు వృద్ది నమోదు చేసే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1,936 గానూ, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 1,272 గానూ ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంది.


Similar News