ఉగాది ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో అమ్మాకానికి వేప పువ్వు.. 100 గ్రాములకు ఎంతంటే?

ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని అందరూ భావిస్తుంటారు. అయితే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథిన జరుపుకుంటారు.

Update: 2024-04-08 09:14 GMT

దిశ, ఫీచర్స్: ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని అందరూ భావిస్తుంటారు. అయితే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథిన జరుపుకుంటారు. ఈ సారి హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 9న మంగళవారం శ్రీ క్రోధి నామ ఉగాదిగా జరుపుకోబోతున్నాము. అయితే ఉగాది పండుగ చేసుకోవాలంటే షడ్రుచులు కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు.

షడ్రుచులు ఆరు రకాలు.. తీపి, చేదు, ఉప్పు, పులుపు, కారం, వగరు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఉగాది పచ్చడి పూర్తైనట్లు అవదు అని హిందూ ప్రజలు అంటుంటారు. అయితే ఈ ఏడాది పల్లెల్లో వేప పువ్వు కొరత లేనప్పటికీ పట్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అమెజాన్ వెబ్‌సైట్ వేప పూతను అమ్మాకానికి ఉంచింది. పొడి వేప పువ్వు 100 గ్రాములకు రూ. 87, 150 గ్రాములు రూ. 207 ధరకు అమ్ముతున్నారు.


Similar News