TVS Motor Q2 Results: రెండో త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ లాభం రూ. 581 కోట్లు.. భారీగా పెరిగిన వాహనాల విక్రయాలు

భారతదేశం(India)లోనే ప్రధాన ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్(TVS Motor) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను బుధవారం ప్రకటించింది.

Update: 2024-10-23 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోనే ప్రధాన ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్(TVS Motor) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో రూ. 588.13 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు టీవీఎస్ మోటార్ తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 415.93 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ.9932.82 కోట్ల నుంచి రూ.11,301.68 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఖర్చులు కూడా పెరిగినట్లు తెలిపింది. గత సంవత్సరం సెకండ్ క్వార్టర్ లో రూ. 9,297. 34 కోట్లుగా ఉన్న ఖర్చులు ఈ సారి రూ. 10,427. 64 కోట్లకు చేరాయని తెలిపింది. అలాగే టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలు  కలిపి మొత్తం 12.28 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయని వెల్లడించింది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు 57,549 నుంచి 75,122 యూనిట్ల వరకు పెరిగియాని తెలిపింది. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి టీవీఎస్ మోటార్ షేరు ధర 3.18 శాతం మేర తగ్గి రూ.2577.95 వద్ద ముగిసింది.

Tags:    

Similar News