Mukesh Ambani: నేడు బిలియనర్ ముఖేష్ అంబానీ పుట్టినరోజు
ఈరోజు భారతదేశపు అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ పుట్టినరోజు.
దిశ, ఫీచర్స్: ఈరోజు భారతదేశపు అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ పుట్టినరోజు. ముఖేష్ ధీరూభాయ్ అంబానీ 19 ఏప్రిల్ 1957న యెమెన్‌లోని ఈడెన్‌లో జన్మించి ప్రపంచ న్యాయస్థానంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అతని తండ్రి ధీరూభాయ్ అంబానీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1958లో వ్యాపారాల్ని మొదలు పెట్టారు. ముకేశ్ అంబానీ 1970ల వరకు ముంబైలోని బోలేశ్వర్‌లో రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో నివసించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొన్నాళ్ల తర్వాత ముఖేష్ అంబానీ తండ్రి కోలాబాలో 14 అంతస్తుల సి-విండ్ నివాస భవనాన్ని కొనుగోలు చేశారు.
ముఖేష్ అంబానీ మన దేశంలోనే కాదు, ఆసియాలోనే కూడా అత్యంత ధనవంతుల్లో ఒకరు. అతను కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, చిన్న కొడుకు అనంత్ అంబానీ. అతని భార్య నీతా అంబానీ . ఆమె రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు.